దీప్తి సునైన లావెక్కిందన్న నెటిజన్!
on Mar 27, 2024
ఇదేందయ్యా ఇది.. ఏదో కాసేపు మాట్లాడుకుందామని కొందరు సెలెబ్రిటీలు నెటిజన్లతో ఛాట్ చేస్తుంటారు. అయితే అది ఇప్పుడు బెడిసికొట్టింది. దీప్తి సునైనా ఆస్క్ మి ఏ క్వశ్చన్ అని అడుగగా.. డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ తో రెచ్చిపోయారు.
దీప్తి సునైనా.. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఫేమ్ లోకి వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. దీప్తి సునైన షణ్ముఖ్ జస్వంత్ కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసి సన్నిహితంగా మారి లవ్ లో పడిపోయారు. ఎటు చూసిన సోషల్ మీడియాలో షణ్ముఖ్, దీప్తి సునైనల జంటనే కన్పిస్తుంది. దీప్తి సునైన, షణ్ముఖ్ ల లవ్ బ్రేకప్ అయినప్పటి నుండి తన పరిధిలో తను ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని గడుపుతుంది. తనకి సంబంధించిన అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ తన ఫాన్స్ కి దగ్గరగా ఉంటుంది దీప్తి సునైన. కాగా తాజాగా తను ఇన్ స్టాగ్రామ్ లో నెటిజన్లతో కాసేపు ఛాట్ చేసింది.
మీరు రోజు వ్యాయామం చేస్తారా అని ఒకరు అడుగగా.. అలా ఏం చేయను. డే వన్, డే టూ, డే త్రీ అంటు అలా ఓ పది రోజులు చేస్తాను ఆ తర్వాత వదిలేస్తాను. గ్యాప్ తీసుకుంటాను మళ్ళీ చేస్తాను. కొందరైతే రోజు చేస్తారు వ్యాయామం. నాకైతే రోజు స్నానం చేయడం కూడా అవ్వదని దీప్తి సునైన రిప్లై ఇచ్చింది. ప్రతీరోజు స్కిప్పింగ్ చేస్తున్నారు కదా ఏం అయిన రిజల్ట్స్ వచ్చాయా అని ఒకరు అడుగగా.. గాయ్స్ వర్కవుట్ చేస్తే కచ్చితంగా రిజల్ట్స్ వస్తాయని దీప్తి సునైన అంది. హెచ్ కె షాంపు యూజ్ చేస్తే బెటరే అని ఒకరు అడుగగా.. ఎస్ గాయ్స్ నేను వాడాను బాగానే ఉందని రిప్లై ఇచ్చింది. మీరు నిజంగానే స్కిప్పింగ్ లో 1000 చేస్తారా అని ఒకరు అడుగగా.. ఎస్ అవును.. అది చేస్తాను ఇటు గట్టిగా తింటానని రిప్లై ఇచ్చింది. మీరు కాస్త లావెక్కారని ఒకరు అడుగగా.. ఫుల్ గా తింటే లావవ్వకుండా ఏమవుతామని తను సమాధానమిచ్చింది. ఇలా అప్పుడప్పుడు యోగా, స్విమ్మింగ్ చేస్తుండగా పోస్ట్ లు చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంటుంది ఈ భామ.
Also Read